|  
● FLASH NEWS
INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  •  BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  • 
Skip to content

Bandi Bhagirath : బండి భగీరథ్ ఐఫోన్ లో దాగిన సీక్రెట్స్ ఏంటి? ఆ 14 మంది యూట్యూబర్లకు చిక్కులు తప్పవా?

హైదరాబాద్, సూర్య న్యూస్: సంచలనం రేపిన పోక్సో (POCSO) కేసులో అరెస్టు అయిన బండి సాయి భగీరథ్ ఐఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ మొబైల్ ఫోన్ (Mobile Phone) లో కీలక ఆధారాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ (Forensic) విశ్లేషణ తర్వాత కేసులో అనేక సీక్రెట్స్ బయటపడే అవకాశం ఉంది. మే 8న ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సాయి భగీరథ్‌ను శనివారం రాత్రి నర్సింగి సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని పెట్‌బషీరాబాద్ (Petbasheerabad) పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.

అక్కడ పోలీసులు సుమారు రెండు గంటల పాటు విచారణ జరిపి అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ సమయంలోనే భగీరథ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ (Magistrate) ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ (Judicial Custody) విధించింది. ప్రస్తుతం అతడు చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. సోమవారం సాయి భగీరథ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఒక పిటిషన్ (Petition) దాఖలు చేయనున్నారు. బాధితురాలు లైంగిక దాడికి గురైనట్లు ఆరోపణలు ఉన్న నాలుగు ప్రదేశాలకు అతడిని తీసుకెళ్లి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో ఎఫ్ఐఆర్ (FIR) లో బండి సాయి బగీరథ్ తో పాటు ఇతరులు అని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదిలా ఉండగా భగీరథ్ కు మద్దతుగా సోషల్ మీడియా (Social Media) లో పోస్టులు పెట్టిన 14 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. డబ్బులు తీసుకుని ఒకే రకమైన కంటెంట్‌తో వీరు వీడియోలు (Videos) చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే బాధితురాలి ఫోటోలు, వివరాలు బయటపెట్టిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భగీరథ్ తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టులో బెయిల్ (Bail) కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp