|  
FLASH NEWS
YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  • 
Skip to content

Shahbad Murders Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడు రాజ్ కుమార్ ఏం చేశాడంటే?

Shahbad Murders Case: రంగారెడ్డి, సూర్య న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) తీవ్ర సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసు (Shahbad Murders Case) నిందితుడు సైకో రాజ్ కుమార్ (Psycho Raj Kumar) కథ విషాదాంతం అయింది. పోలీసుల కళ్లు కప్పి పరారైన ఈ నరహంతకుడు చివరకు శవమై కనిపించాడు. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కొత్తూరు (Kothur) మండలం పంజర్ల పరిధిలో రాజ్ కుమార్ ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు (Police) సోమవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

​మృతుడి పక్కనే విషం సీసా లభించడంతో అతను పాయిజన్ తాగి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల క్రితం షాబాద్ మండలంలో ఒకేసారి ఆరుగురిని రాజ్ కుమార్ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ సామూహిక హత్యల (Mass Murders) ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. నిందితుడి కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో (Special Teams) ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణతో పాటు బెంగళూరులోనూ సోదాలు నిర్వహించారు. రాజ్ కుమార్ ను పట్టిస్తే రూ. 2 lakhs రివార్డు (Reward) కూడా ప్రకటించారు.

రాజ్ కుమార్ చేతిలో బలైన వారిలో అతని భార్య పార్వతి సరిత (30), కుమారులు పరిక్షిత్ (3), దైవిక్షిత్ (2) ఉన్నారు. వీరితో పాటు చిట్యాల రుక్కమ్మ (65), ఆమె కుమార్తె చిట్యాల లక్ష్మి (45), మరో మైనర్ బాలిక (17)లను కూడా వేటాడి చంపాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఒకే చోట ముగ్గురిని, మరో చోట ముగ్గురిని చంపేశానని చెప్పి పరారయ్యాడు. ఈ విషయం తెలియగానే సిటీ పోలీస్ కమిషనర్ (CP Tarun Joshi) డాక్టర్ తరుణ్ జోషి, డీసీపీ (DCP Yogesh Gautam) యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. చివరకు నిందితుడు పంజర్ల సమీపంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కేసు ముగిసింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp