రిపోర్టర్: Anil goud

గద్వాల, సూర్య న్యూస్ : జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్, వీరేష్ గౌడ్ తల్లి మాణిక్యమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఇన్చార్జ్ బాసు హనుమంతు నాయుడు శనివారం వారి స్వగృహానికి చేరుకుని పరామర్శించారు. మాణిక్యమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బాసు హనుమంతు నాయుడు వెంట బీఆర్ఎస్ నాయకులు తిరుమలేష్, రఘు గౌడ్, మాలిక్, రంగస్వామి, తిమ్మప్ప, ఆంజనేయులు, శ్రీకాంత్, బిసన్న, నరసింహులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



