|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

దేశంలో తొలి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి : తీర్పు చెబుతూ కన్నీరు పెట్టుకున్న న్యాయమూర్తులు

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : సుదీర్ఘకాలంగా అచేతన స్థితిలో ఉన్న ఓ యువకుడికి పాసివ్ యుథనేషియా (నిష్క్రియాత్మక దయా మరణం) ప్రసాదించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అంగీకరిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది, గడచిన 13 సంవత్సరాలుగా పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్‌లో నరకయాతన అనుభవిస్తున్న 31 ఏళ్ల హరీష్ రాణాకు వైద్య సహాయం తొలగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది, 2018 నాటి కామన్ కాజ్ తీర్పును అమలు చేస్తూ దేశంలో కారుణ్య మరణాన్ని అధికారికంగా అనుమతించిన మొట్టమొదటి కేసుగా ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

​ఈ సంచలన తీర్పు పాఠాన్ని కోర్టు హాల్‌లో చదివి వినిపించే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ పార్థీవాలా మరియు జస్టిస్ కేవీ విశ్వనాథన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు, ఒక దశలో జస్టిస్ పార్థీవాలా గొంతు పెగల్లేక కన్నీరు పెట్టుకుని గద్గద స్వరంతో మాట్లాడారు, హరీష్‌కు ఇన్నాళ్లుగా అందిస్తున్న లైఫ్ సపోర్ట్ లేదా వైద్య సహాయాన్ని తొలగించడం పూర్తిగా మానవతా దృక్పథంతో కూడిన చర్య అని మరియు ఇది చట్టబద్ధంగా ఆమోదయోగ్యమేనని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp