|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

Harish Rana : 13 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా మృతి

​న్యూ ఢిల్లీ, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హరీష్ రాణా (Harish Rana) ఉదంతం విషాదాంతమైంది, గత 13 ఏళ్లుగా నూటికి నూరు శాతం కోమాలో (Vegetative State) ఉన్న హరీష్ రాణా (32) మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS Delhi) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు, కోలుకునే అవకాశం లేని హరీష్‌కు కారుణ్య మరణం (Passive Euthanasia) ప్రసాదించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల చారిత్రాత్మక తీర్పునిచ్చిన నేపథ్యంలో వైద్యులు లైఫ్ సపోర్ట్‌ను దశలవారీగా తొలగించగా ఆయన కన్నుమూసినట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

దేశంలోనే ఇలాంటి కేసులో అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం, 2013లో తన ఇంట్లోని నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో హరీష్ రాణా తీవ్రమైన తల గాయాల పాలై అప్పటి నుంచి కోమాలోకి వెళ్ళిపోయారు, కేవలం కళ్ళు మాత్రమే తెరిచే స్థితిలో ఉన్న హరీష్ కనీసం నీటిని కూడా స్వయంగా మింగలేక గొట్టాల ద్వారా ఆహారం తీసుకునేవారు, తన కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిన తండ్రి కారుణ్య మరణానికి అనుమతించాలని కోర్టును ఆశ్రయించగా మెడికల్ బోర్డ్ రిపోర్ట్ ఆధారంగా న్యాయస్థానం పచ్చజెండా ఊపింది, ఈ క్రమంలో ఎయిమ్స్ ప్రత్యేక వైద్య బృందం హరీష్‌కు అందిస్తున్న కృత్రిమ శ్వాసను క్రమంగా నిలిపివేయడంతో 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ముగిసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp