|  
● FLASH NEWS
Deal: పరస్పర సుంకాల తగ్గింపునకు అమెరికా-చైనా అంగీకారం  •  Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. యూనియన్లపై ఉద్యోగుల ఆగ్రహం  •  Kohli: కోహ్లీ–గిల్ సెంచరీలు.. వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం  •  CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  •  Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక రజతం  • 
Skip to content

Deal: పరస్పర సుంకాల తగ్గింపునకు అమెరికా-చైనా అంగీకారం

వాషింగ్టన్, సూర్య న్యూస్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే అమెరికా, చైనా దేశాలు ఒక కీలక ఒప్పందానికి వచ్చాయి. పరస్పరం విధించుకునే వాణిజ్య సుంకాలను (Tariffs) తగ్గించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చైనా వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఈ ఒప్పందం ప్రకారం, దాదాపు 30 బిలియన్ డాలర్ల (30 Billion Dollars) విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించనున్నట్లు చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, 90 శాతం ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లను మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) రేట్లకు తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా, ఇండియాతో పాటు మరికొన్ని దేశాలపై అమెరికా ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా డీల్ కుదరడంతో ఇప్పుడు ఆ టారిఫ్‌ల నుంచి చైనాకు భారీ ఊరట లభించినట్లయింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp