|  
● FLASH NEWS
Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  •  Deal: పరస్పర సుంకాల తగ్గింపునకు అమెరికా-చైనా అంగీకారం  •  Strike: బ్యాంకుల సమ్మె వాయిదా.. యూనియన్లపై ఉద్యోగుల ఆగ్రహం  •  Kohli: కోహ్లీ–గిల్ సెంచరీలు.. వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం  •  CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  • 
Skip to content

Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : సుప్రీంకోర్టు (Supreme Court) జడ్జీలుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం (Collegium) కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ఈ ప్రతిపాదనల్లో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న అపరేష్ కుమార్ సింగ్ పేరు కూడా ఉండటం గమనార్హం.

కొలీజియం కేంద్రానికి పంపిన జాబితాలో తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్, ఢిల్లీ హైకోర్టు సీజే దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, అలాగే గుజరాత్ హైకోర్టు సీజే సునీతా అగర్వాల్ పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురు సీజేల పదోన్నతికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే, అప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తితో (CJI) కలుపుకుని సుప్రీంకోర్టులో మొత్తం సిట్టింగ్ జడ్జీల సంఖ్య 37కు చేరుకుంటుంది.

మరోవైపు, తెలంగాణ న్యాయస్థానానికి సంబంధించి కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. గతంలో ఇక్కడి నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ వినోద్ కుమార్‌ను ఇప్పుడు మళ్లీ తిరిగి తెలంగాణ హైకోర్టుకే పంపాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp