|  
● FLASH NEWS
PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  •  Archery: ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల హవా.. రెండు స్వర్ణాలు కైవసం  •  Kalki: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత  •  Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  • 
Skip to content

PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్

పుణె, సూర్య న్యూస్ : పుణె ఫోర్ట్ మర్డర్ (Pune Fort Murder) కేసుగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలు వెలుగులోకి తెచ్చారు. కేతన్‌ను అతడి కాబోయే భార్య సియా పక్కా ప్లాన్‌తో, దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘మేఘాలయ హనీమూన్ మర్డర్’ కేసును స్ఫూర్తిగా తీసుకుని హత్య చేసినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు పేర్కొన్నారు. ప్రియుడిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే.. కేతన్‌ను అత్యంత క్రూరంగా అంతమొందించేందుకు సియా పన్నిన పన్నాగం పోలీసు దర్యాప్తులో బట్టబయలైంది.

మేఘాలయ మర్డర్.. సియా రీసెర్చ్

పోలీసుల దర్యాప్తులో సియా వ్యవహారంపై దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. కేతన్‌ను ఎవరూ గుర్తుపట్టకుండా ఎలా చంపాలో తెలుసుకునేందుకు సియా, చేతన్‌ (సియా ప్రియుడు) కలిసి ఇంటర్నెట్‌లో క్రైమ్ పాడ్‌క్యాస్ట్‌లు వినడంతో పాటు, మేఘాలయలో సోనమ్ అనే మహిళ తన భర్త రాజా రఘువంశీని హనీమూన్‌లో ఎలా చంపిందో ఆ కేసు గురించి సుదీర్ఘంగా అధ్యయనం చేశారని ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఆ కేసులో సోనమ్ చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ పక్కా ప్లాన్‌తో కేతన్ హత్యకు స్కెచ్ వేశారని నిర్ధారించారు.

మహి పేరుతో ఫేక్ అకౌంట్.. లోహగడ్ కోట ఎంపిక

హత్యకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకునేందుకు సియా చాలా జాగ్రత్తలు తీసుకుంది. లోహగడ్ కోటలో సీసీ కెమెరాలు లేని ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి ఫొటోతో ‘మహి’ అనే పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసింది. తన ఫ్రెండ్ మహి అంటూ ఆ అకౌంట్ నుంచి కొన్ని మెసేజ్‌లను కేతన్‌కు సియా చూపించింది. ఆ తర్వాత కేతన్‌కు బర్త్‌డే సర్ ప్రైజ్ ఇద్దామని నమ్మించి కోట పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

టాటూలు.. ఎంగేజ్‌మెంట్‌ డ్రామా

మరోవైపు కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ పోలీసులకు కీలక వివరాలు అందించారు. సియా పుట్టినరోజు సందర్భంగా కేతన్ ఆమె పేరును పచ్చబొట్టు (టాటూ) వేయించుకున్నాడని, జూన్ 19న మహాబలేశ్వరంలో సియా కోసం ప్రత్యేకంగా బర్త్‌డే వేడుకలు ప్లాన్ చేశాడని ఆయన వాపోయారు. వారిద్దరి ఎంగేజ్‌మెంట్ కోసం సియాకు నచ్చిన 28 డ్రెస్‌లు, 18 సెట్ల నగలు కొనిచ్చామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరిలోనే సీక్రెట్ మ్యారేజ్!

ఈ హత్య కేసు దర్యాప్తులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఫిబ్రవరిలోనే కేతన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత.. సియా తన ప్రియుడు చేతన్‌ను సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ వివాహానికి ఆమె ఫ్రెండ్స్ ఇద్దరు సాక్షి సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. సియా, చేతన్‌ల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. ప్రేమించిన వాడితో పెళ్లి కోసం కాబోయే భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన సియా ఉదంతం పుణెలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp