|  
● FLASH NEWS
YSRCP: కూటమి పాలనలో ధరల మంట.. బాదుడే బాదుడన్న జగన్  •  TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  •  10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పాస్!  •  Sai Pallavi: నా కాబోయే భర్తకు స్వార్థం ఉండకూడదు.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు  •  Visa: ఆస్ట్రేలియా వీసా రూల్స్ చేంజ్.. భారతీయులకు ఇకపై బయోమెట్రిక్స్ తప్పనిసరి  • 
Skip to content

BRAOU: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పీజీ ఫలితాలు విడుదల

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) జూలై-2026లో నిర్వహించిన పీజీ (PG Results) ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సుల ఫలితాలను వర్సిటీ తన అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం అందుబాటులో ఉంచింది.

ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, చరిత్ర, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తదితర విభాగాలకు చెందిన విద్యార్థులు తమ అడ్మిషన్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకునే విధానం

విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ braouonline.in ఓపెన్ చేసి ‘Exam Result’ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘PG (M.A, M.Com and M.Sc) I and II Year Examination Results July-2026’ లింక్‌పై క్లిక్ చేసి, తమ అడ్మిషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మార్కులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెండు సంవత్సరాల పీజీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో (CMM), ఒరిజినల్ డిగ్రీ (OD) సర్టిఫికెట్ల కోసం వెబ్‌సైట్‌లోని ‘Apply for Certificates’ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర సమాచారం కోసం విద్యార్థులు తమ స్టడీ సెంటర్లను సంప్రదించవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp