|  
FLASH NEWS
KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  •  BRICS Summit 2026 : ‘మంచివారితోనే స్నేహం.. చెడ్డవారితో వద్దు’.. బ్రిక్స్ వేళ మోదీ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి?  •  KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  • 
Skip to content

ప్రశ్నిస్తే దాడులా?

బీజేపీ నేత రాజుగౌడ్‌పై దాడి..

కాంగ్రెస్ పనేనని కమలనాథుల ఆరోపణ

630D898E D880 459B 8F44 021980C3ADD0

మునుగోడు, (సూర్య న్యూస్ తెలుగు): ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మునుగోడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ బూడిద బిక్షంగౌడ్‌ మండిపడ్డారు. గట్టుప్పల్‌ మండలం అంతంపేటకు చెందిన బీజేపీ నేత వీరమల్ల రాజుగౌడ్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అండదండలతోనే కాంగ్రెస్‌ వర్గాలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నాయని ఆరోపించారు.

ఇటీవల నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటన మరువకముందే.. తాజాగా రాజుగౌడ్‌పై దాడి జరగడం ఆందోళనకరమన్నారు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్‌రెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp